MP Balka Suman addressing people (తెలంగాణ ప్రజల అభివృద్ధే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్న పెద్దపల్లి ఎంపీ బాల్క సుమ��
వచ్చే మూడేండ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం, శ్రీరాంసాగర్ ఫేజ్-2 పనులకు త్వరలో శంకుస్థాపన చెస్తామని ఎంపీ సుమన్
తెలంగాణ ప్రజలనుద్దెసించి సోమవారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్నా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ స్పష్టంచేశారు. అభివృద్ధే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌కు ఉందని, రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులతోపాటు ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వదులుకున్న చరిత్ర ఉందని గుర్తుచేశారు. పనీపాటా లేని కొన్ని పార్టీలు, ఆంధ్రా తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కార్డులు, పింఛన్లు అందజేస్తామని తెలిపారు. అనర్హుల రేషన్ కార్డులు తొలగిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను తొందర్లోనె పరిష్కరిస్తాం అని తెలిపారు. ప్రైవేట్ విద్యుత్‌ను సైతం కొనుగోలు చేయనివ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ సంస్థలను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. వచ్చే మూడేండ్లల్లో మిగులు విద్యుత్ సాధిస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, త్వరలో శంకుస్థాప చేయనున్నట్లు తెలిపారు.
- See more at: http://www.fulltelangana.com/newsinfo/mp-balka-suman-addressing-people-#sthash.QrLJ20AM.dpuf
No comments:
Post a Comment