Archaeologists found idles of god in Alampur (అలంపుర్ లొ దొరికిన అమ్మవారి బొమ్మలు)
మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ పుణ్యక్షేత్రంలోని శ్రీజోగుళాంబబాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల సముదాయంలో గల స్వర్గబ్రహ్మాలయం వద్ద పురావస్తుశాఖ ఆధికారులు రామకృష్ణారెడ్డి, సుబ్బయ్యల పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఆలయ ముందు భాగంలో జరిపిన తవ్వకాల్లో సప్తమాత్రుకలలో శివాణి, బ్రహ్మణిమాత విగ్రహలు, రాతీనీటి తోట్టిలు బయటపడినట్లు పురవాస్తుశాఖ ఏసీ కృష్ణచైతన్య తెలిపారు. ఈ ఆలయం ముందు భాగంలో భూ సమాంతరం నుంచి సుమారు ఒక మీటరు లోతు వరకు ఈ తవ్వకాలు కొనసాగాయని సిబ్బంది తెలిపారు. ఈ తవ్వకాలు ఇలాగే కొనసాగితే మరెన్నో కట్టడాలు బయట పడే అవకాశాలున్నాయని పరిశోధకులన్నరు . ఐతె ఈ ఆలయం 7వ శతాబ్దం నాటిది. దినిని బదమి చలుక్యుల కాలంలొ నిర్మించారు. ఇక్కడ తవ్వకాలు జరపడం వల్ల ఇంకా కొన్ని చారిత్రక ఆంశాలు తెలిసె అవకాశం ఉందన్నారు.
- See more at: http://www.fulltelangana.com/newsinfo/archaeologists-found-idles-of-god-in-alampur-#sthash.zouH0E4T.dpuf
No comments:
Post a Comment